News June 22, 2024
దూబే స్థానంలో శాంసన్‌ని తీసుకుంటారా?

ఎన్నో అంచనాలతో జట్టులోకి తీసుకున్న పేస్ ఆల్‌రౌండర్ శివం దూబే T20WCలో రాణించడం లేదు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈరోజు బంగ్లాదేశ్‌తో జరిగే కీలక సూపర్8 మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా సంజూ బ్యాటింగ్‌కు దిగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి స్పిన్, పేస్ రెండింటినీ సమర్థంగా ఎదుర్కోగల సంజూకి ఛాన్స్ దొరుకుతుందో లేదో వేచి చూడాలి.
Similar News
News November 21, 2025
సెలవులో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి సొంత రాష్ట్రమైన పంజాబ్ వెళ్లారు. ఈ నెల 26న తిరిగి గుంటూరు వచ్చి మరుసటి రోజు అంటే 27న ఎస్పీ వకుల్ జిందాల్ విధుల్లోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమించారు.
News November 21, 2025
యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్
News November 21, 2025
iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.


