News December 17, 2024
స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇస్తారా?

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి <<14906903>>అతిభారీ వర్షాలు<<>> కురుస్తాయని APSDMA హెచ్చరించింది. దీంతో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు. ముందుగానే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు సెలవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Similar News
News October 31, 2025
‘పహల్గామ్’ టెర్రరిస్టుల ఏరివేత.. 40 మందికి పురస్కారాలు

దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తు, ప్రత్యేక ఆపరేషన్లలో ప్రతిభ కనబర్చిన 1,466మంది ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో పహల్గామ్ ఉగ్రవాదుల ఏరివేత(ఆపరేషన్ మహాదేవ్)లో పాల్గొన్న 40మంది J&K పోలీసులు, CRPF సిబ్బంది ఉన్నారు. హోంశాఖ పరిధిలోని పురస్కారాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన కేంద్రం.. ఏటా ‘సర్దార్’ జయంతి రోజు(OCT31) దక్షతా పదక్ అవార్డులను ప్రకటిస్తోంది.
News October 31, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉండరాదని సూచించింది. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని IMD తెలిపింది. కాగా ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో పొడివాతావరణం కనిపించింది. అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిశాయి.
News October 31, 2025
తక్షణమే సాయం చేయండి.. కేంద్రానికి ఏపీ నివేదిక

AP: మొంథా తుఫాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. 1.38L హెక్టార్లలో పంట నష్టం, 2.96L మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని తెలిపింది. ‘249 మండలాల పరిధిలో 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం పడింది. రైతులకు ₹829Cr నష్టం వచ్చింది. రోడ్లు, విద్యుత్ సహా 17 రంగాల్లో ₹5,244Cr నష్టం వాటిల్లింది. పరిశీలనకు కేంద్ర బృందాలను పంపి తక్షణమే సాయం అందించాలి’ అని కోరింది.


