News October 17, 2024
సీఎం రేవంత్ కామెంట్స్‌పై రేపు మాట్లాడతా: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మూసీ పునరుజ్జీవం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను రేపు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ భవన్లో ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. మూసీ ప్రాజెక్ట్ గురించి సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై మాట్లాడతానని చెప్పారు.
Similar News
News January 18, 2026
జోరందుకున్న మద్యం అమ్మకాలు

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.
News January 18, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<
News January 18, 2026
చైనాలో నోరోవైరస్ కలకలం.. కొత్తదేనా?

చైనాలోని ఓ స్కూల్లో 100 మందికి పైగా విద్యార్థులు నోరోవైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 1968లోనే USలో బయటపడింది. భారత్‌లో కూడా గతంలో కేరళ, పుణే వంటి నగరాల్లో ఈ వైరస్ కలకలం రేపింది. ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం తక్కువే. అయినా తీవ్రమైన నీరసం, డీహైడ్రేషన్, డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


