News April 16, 2025

శ్రీదేవి బయోపిక్‌లో చేస్తారా?.. హీరోయిన్ రియాక్షన్ ఇదే

image

హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌లో చేస్తారా? అని యాంకర్ అడగ్గా.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్లువచ్చి గోదారమ్మ(గద్దలకొండ గణేశ్) సాంగ్‌లో చేశానని చెప్పారు. హీరోయిన్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని తెలిపారు. కాగా సూర్యతో ఈ బ్యూటీ నటించిన ‘రెట్రో’ మూవీ మే 1న రిలీజ్ కానుంది.

Similar News

News April 16, 2025

జపాన్ పర్యటనకు CM రేవంత్

image

TG: CM రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 22 వరకు తన బృందంతో కలిసి టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటిస్తారు. ఈనెల 21న ఒసాకా వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. 23న తిరిగి HYD చేరుకుంటారు.

News April 16, 2025

ALERT: లాసెట్ దరఖాస్తు గడువు పెంపు

image

TG: LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు.

News April 16, 2025

వక్ఫ్ సవరణ చట్టంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

image

వక్ఫ్ సవరణ చట్టంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరగనుంది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, వైసీపీ, ఎస్పీ, టీవీకే, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, ఎంఐఎం పార్టీలతో పాటు ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఇతరులు ఈ పిటిషన్లు వేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం మ.2 గంటల నుంచి వాదనలు విననుంది.

error: Content is protected !!