News September 19, 2024
‘జమిలి’కి రాష్ట్రాలు అంగీకరిస్తాయా?

జమిలి ఎన్నికలు జరగాలంటే కీలక రాజ్యాంగ సవరణలతో పాటు రాష్ట్రాల సమ్మతి కూడా అవసరం. జమిలికి 14 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎన్డీయేకి ఇబ్బందులు లేనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 20 రాష్ట్రాల్ని ఎన్డీయే మిత్రపక్షాలు పాలిస్తున్నాయి. అందులో 13 రాష్ట్రాల్ని బీజేపీ సొంతంగా ఏలుతోంది. దీంతో ఈ విషయంలో ఎన్డీయేకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదు.
Similar News
News October 25, 2025
AIIMS రాయ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

<
News October 25, 2025
హైదరాబాద్‌లో స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్?

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ మన దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా దేశంలోని 9 సిటీల్లో ఎర్త్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. హైదరాబాద్, ముంబై, నోయిడా, చండీగఢ్, కోల్‌కతా, లక్నో తదితర నగరాలు ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. జాతీయ భద్రత దృష్ట్యా టెస్టింగ్ దశలో స్టార్‌లింక్‌కు కఠిన ఆంక్షలతో కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చింది.
News October 25, 2025
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


