News November 7, 2024
వైసీపీలోనే ఉంటా: జోగి రమేశ్

AP: తాను పార్టీ మారుతున్నట్లు గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై జోగి రమేశ్ స్పష్టత ఇచ్చారు. ‘నేను వైసీపీలోనే ఉంటా. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే ప్రయాణం కొనసాగిస్తా. 2019లో జగన్ కోసం సీటు త్యాగం చేసి పక్కకు వెళ్లా. నేను YSR శిష్యుడిని. నా కుమారుడిపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఎవరెన్ని కేసులు పెట్టినా బెదిరే వ్యక్తిని కాదు’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 26, 2025
కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.
News November 26, 2025
స్టూడెంట్స్ అసెంబ్లీ.. దద్దరిల్లుతున్న సభ

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరుగుతున్న ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ వాడివేడిగా జరుగుతోంది. విద్యార్థులు మంచి అంశాలపై చర్చ జరుపుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. మంత్రులు వీటికి దీటుగా బదులిస్తున్నారు. లోకేశ్, పవన్ కళ్యాణ్ పాత్రలు పోషిస్తున్న చిన్నారులు పంచ్ డైలాగులతో సమాధానాలు ఇస్తున్నారు. సభ పక్కదారి పట్టకుండా స్పీకర్(అమ్మాయి) అదుపు చేస్తున్నారు.
News November 26, 2025
జూన్-జులై మధ్య గోదావరి పుష్కరాలు?

AP: గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26-జులై 7 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వేదపండితులతో దేవదాయ శాఖ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై CM CBN త్వరలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నాయి. చివరిసారి 2015లో గోదావరి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే.


