News June 22, 2024

సింగరేణి కార్మికులకు అండగా ఉంటా: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినా BRS ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దీనివల్ల రూ.2వేల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు. ఓడిపోయిన బాధలో కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Similar News

News November 24, 2025

రాజన్న కోడె మొక్కు చెల్లించుకున్న 5,547 మంది భక్తులు

image

వేములవాడ రాజన్న క్షేత్రంలో సోమవారం నాడు 5,547 మంది భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ శ్రీ స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు భీమేశ్వరాలయం రద్దీగా మారింది. శ్రీ స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో 94 జంటలు పాల్గొన్నాయి. వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు పాల్గొని తరించారు.

News November 24, 2025

బంకుల్లో జీరోతో పాటు ఇది కూడా చూడండి

image

వెహికల్స్‌లో పెట్రోల్/ డీజిల్ ఫిల్ చేయిస్తే మెషీన్‌లో 0 చెక్ చేస్తాం కదా. అలాగే ఫ్యూయల్ మెషీన్‌పై ఉండే డెన్సిటీ మీటర్ నంబర్స్ గమనించారా? BIS గైడ్‌లైన్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ పెట్రోల్: 720-775 kg/m³ లేదా 0.775 kg/L, డీజిల్: 820 to 860 kg/m³ ఉండాలి. ఇది ఫ్యూయల్ ఎంత క్వాలిటీదో చెప్పే మెజర్‌మెంట్. ఇంజిన్ పర్ఫార్మెన్స్, జర్నీకి ఖర్చయ్యే ఫ్యూయల్‌పై ప్రభావం చూపే డెన్సిటీపై ఇకపై లుక్కేయండి.
Share It

News November 24, 2025

రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

image

హైదరాబాద్‌లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్‌పై ఈ రైడ్స్ జరిగాయి.