News March 23, 2025
జూన్‌లో సూర్య-అట్లూరి మూవీ షురూ?

వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య నటించనున్న సినిమా జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ప్రీప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే లేదా కయాదు లోహర్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఈ మూవీని నాగవంశీ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.
Similar News
News January 24, 2026
ఏయూ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలు విడుదల

ఏయూ పరిధిలోని రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో ఎంబీఏ మూడవ, మొదటి సెమిస్టర్, బీటెక్, ఎంటెక్ మొదటి, 2వ, 6వ సెమిస్టర్, న్యాయవిద్య మొదటి, 4వ, 5వ, 6వ సెమిస్టర్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బోటనీ, హోమ్ సైన్స్, బీఈడీ మొదటి, రెండో సెమిస్టర్ కోర్సులకు సంబంధించిన రీవాల్యుయేషన్ ఫలితాలను కొద్దిసేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. వీటిని ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
News January 24, 2026
CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌లోని <
News January 24, 2026
క్రెడిట్ చోరీయా… జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: CBN

AP: జగన్ చేసిన పనుల్ని ప్రజలు మరిచిపోతే మళ్లీ వినాశనమే అని CM CBN హెచ్చరించారు. ‘తన మనుషుల్ని పెట్టుకొని ల్యాండ్ టైటిలింగ్‌తో భూమి కాజేసే ప్రయత్నం చేశారు. చివరకు దేవునికిచ్చిన నెయ్యినీ కల్తీ చేశారు. రాక్షసపాలన సాగించారు. తప్పుడు కేసుతో నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు అమరావతిని అడ్డుకుంటున్నారు. నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. ఆయనకేం క్రెడిట్ ఉంది. ఇలాంటి వారిపట్ల జాగ్రత్త’ అని సూచించారు.


