News December 17, 2024

తగ్గనున్న స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలు?

image

స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్ కంపెనీల ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్ తగ్గించేందుకు GST కౌన్సిల్ యోచిస్తోందని సమాచారం. ప్రస్తుతమున్న 18 నుంచి 5 శాతానికి తగ్గించొచ్చని CNBC TV18 పేర్కొంది. ఫిట్‌మెంట్ కమిటీ సూచన మేరకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 2022, JAN 1నుంచే వర్తించొచ్చని తెలుస్తోంది. రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జీతో తమ డెలివరీ ఛార్జీలను సమం చేయాలని ఈ కంపెనీలు గతంలో కేంద్రాన్ని కోరాయి.

Similar News

News November 25, 2025

ICAR-IIMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

HYDలోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌లో 5 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ ), PhD, PG( అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.millets.res.in/

News November 25, 2025

రాములోరి జెండా ప్రత్యేకతలివే..

image

జెండాపై రాముడి సూర్యవంశం సూచించేలా భానుడు, విశ్వంలో సంపూర్ణ పవిత్ర శబ్దం ఓం, కోవిదారు వృక్ష చిహ్నాలున్నాయి. మందార, పారిజాత వృక్షాల అంటుకట్టుతో కశ్యప రుషి ఈ చెట్టును సృష్టించారని పురాణాలు తెలిపాయి. భరతుడి రథ ధ్వజంలోని జెండాలో గల ఈ చిహ్నం గురించి రఘువంశంలో కాళిదాసు ప్రస్తావించారు. ఈ జెండాను లక్ష్మణుడు దూరం నుంచే చూసి ‘సీతారాములను అయోధ్యకు తీసుకెళ్లేందుకు భరతుడు వస్తున్నాడ’ని అన్నకు సమాచారమిచ్చారు.

News November 25, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలోని వన్ స్టాప్ సెంటర్‌లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/