News March 16, 2024
రెండు నెలల్లో మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తా: YSJ

అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘రెండు నెలల్లో మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకువెళ్లేలా అడుగులు వేస్తాం’ అని CM జగన్ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ట్వీట్లో తెలిపింది. వైసీపీ ప్రకటించిన 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీల స్థానాలపై మీ కామెంట్?
Similar News
News January 24, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS ఇన్ఛార్జుల నియామకం

TG: త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమన్వయకర్తలను నియమించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. వీరు అభ్యర్థుల ఎంపిక, శ్రేణులను సమన్వయం చేయడం, ప్రచార వ్యూహాలను రచిస్తారు. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తారు. ప్రజల మద్దతుతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు KTR పిలుపునిచ్చారు.
News January 24, 2026
T20 WC నుంచి బంగ్లా ఔట్.. ఏం జరిగింది?

బంగ్లాలో అల్లర్లు, హిందువులపై దాడులతో భారతీయుల్లో నిరసన వ్యక్తమైంది. దీంతో IPLలో KKR తరఫున ఆడాల్సిన ముస్తాఫిజుర్ను తొలగించాలని BCCI ఆదేశించింది. అందుకు ప్రతీకారంగా BAN తమ దేశంలో IPL ప్రసారాన్ని నిలిపివేయడంతో వివాదం ముదిరింది. INDలో T20 WCకు తామూ రాబోమని BAN మొండికేసింది. వేదికల మార్పు కుదరదని ICC తేల్చి చెప్పింది. BAN తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో WCకు ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది.
News January 24, 2026
హైకోర్టులే ప్రాథమిక సంరక్షకులు: సీజేఐ సూర్యకాంత్

సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో హైకోర్టుల పాత్ర అత్యంత కీలకమని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇవి ప్రాథమిక సంరక్షకులుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. న్యాయం ప్రజలకు దూరమైన భావన రాకుండా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. HCలు కేవలం అప్పీల్/రివిజన్ కోర్టులుగా కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు అందుబాటులో ఉండే కేంద్రాలుగా మారాలన్నారు. నేరుగా SCను ఆశ్రయించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.


