News April 4, 2024
అనపర్తి టికెట్ టీడీపీకి దక్కనుందా?

AP: పొత్తులో భాగంగా BJPకి కేటాయించిన అనపర్తి టికెట్ TDPకే దక్కనున్నట్లు సమాచారం. అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి TDP రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఇరు పార్టీలు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీటును BJPకి కేటాయించినా ఇంకా నిర్ణయం కాలేదని కొవ్వూరు సభలో చంద్రబాబు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నల్లమిల్లి కూడా రెండు రోజుల్లో కార్యకర్తల ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పడం గమనార్హం.
Similar News
News February 9, 2026
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

AP: అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ జీవో జారీ చేసింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎన్‌విడియా కంపెనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచే వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే తొలి ఏఐ వర్సిటీగా నిలవనుంది.
News February 9, 2026
దీపారాధనలో ఎన్ని వత్తులు పెట్టాలి?

దీపారాధనలో వత్తుల సంఖ్యకు శాస్త్రపరంగా ప్రాముఖ్యత ఉంది. నిత్య దీపారాధనలో ఏకవత్తి పెట్టకూడదు. ఒకే వత్తిని అశుభ సమయాల్లో మాత్రమే వాడతారు. సామాన్యంగా ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కనీసం 2 వత్తులు కలిపి వేయడం శుభప్రదం. దీనిని ‘దంపతి వత్తి’ అని కూడా అంటారు. రెండుకు మించి ఇంకా ఎన్ని వత్తులైనా పెట్టవచ్చు. అందుకు ఎలాంటి నియమాలు లేవు. 108 వత్తుల దీపం వెలిగిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయని నమ్మకం.
News February 9, 2026
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


