News March 4, 2025
టీమ్ ఇండియా ఫైనల్ చేరేనా?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరిగే సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లాలని టీమ్ ఇండియా భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ కూడా ఈ మ్యాచులో నెగ్గి ఫైనల్లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
Similar News
News March 4, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు BIG UPDATE

AP: గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమ పోస్టుల ప్రాధాన్యం, జోన్, జిల్లా, ప్రాధాన్యతలు సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని APPSC కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీలోగా APPSC వెబ్సైటులో తమ వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. హారిజంటల్ రిజర్వేషన్ అమల్లో భాగంగా మహిళలకు కేటాయించిన పోస్టులకు సరిపడినంత మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించనుంది.
News March 4, 2025
గతంలో విరాట్ కోహ్లీపైనా షామా సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ గతంలో విరాట్పైనా నోరు పారేసుకున్నారు. తనకు విదేశీ క్రికెటర్లు ఇష్టమన్న ఓ అభిమానిపై విరాట్ 2018లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోహ్లీ బ్రిటిష్ వారు కనిపెట్టిన ఆట ఆడుతున్నారు. విదేశాల బ్రాండ్స్కు రాయబారి. ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. గిబ్స్ ఆయన అభిమాన క్రికెటర్. కానీ విదేశీ ఆటగాళ్లను ఇష్టపడేవారిని దేశం వదిలిపొమ్మంటారు’ అని షామా అప్పట్లో ట్వీట్ చేశారు.
News March 4, 2025
మీకు 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు చేయించుకోండి

ఏదైనా రోగం ముదిరాక ఆస్పత్రికి వెళ్లడం కంటే ముందే కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 1-2 ఏళ్లకోసారైనా BP, CBC, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ECG, లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, BMI చెక్, థైరాయిడ్, యూరిన్ టెస్ట్, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఉచితంగానే చేస్తారు.