News December 29, 2024
టీమ్ ఇండియా WTC ఫైనల్ చేరాలంటే?
తొలిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా చేరుకుంది. మరో బెర్త్ కోసం భారత్‌కు ఆస్ట్రేలియా నుంచి తీవ్ర పోటీ నెలకొంది. మెల్‌బోర్న్ టెస్ట్ డ్రా చేసుకుని, తర్వాత జరిగే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాలి. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆసీస్ 0-1 తేడాతో ఓడిపోవాలి. లంకపై ఆస్ట్రేలియా ఎట్టిపరిస్థితుల్లో రెండు టెస్టులు గెలవకూడదు. ఇలా జరిగితే టీమ్ ఇండియా WTC ఫైనల్‌కు వెళ్తుంది.
Similar News
News January 1, 2025
ప్రజలకు అందుబాటులో ఉండండి.. MLAలకు సీఎం సూచన
TG: స్థానిక సంస్థల్లో సమన్వయంతో పని చేసి గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ‘నేను మారాను. మీరూ మారండి. స్థానిక ఎన్నికలు చాలా కీలకం. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నా దగ్గర సమాచారం ఉంది. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు ఉన్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండండి’ అని సూచించారు.
News January 1, 2025
సంధ్య థియేటర్ ఘటనపై NHRC నోటీసులు
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల కమిషన్(NHRC) నోటీసులు జారీ చేసింది. పోలీసుల లాఠీఛార్జ్ వల్లే రేవతి చనిపోయిందని న్యాయవాది రామరావు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరపాలంది. లాఠీఛార్జ్‌పై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని NHRC ఆదేశించింది.
News January 1, 2025
అమరావతిలో రూ.2,322 కోట్ల పనులకు టెండర్లు
AP: రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.2,322 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ, ఏడీసీ టెండర్లు ఆహ్వానించాయి. టెండర్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 22వ తేదీగా నిర్ణయించాయి. ఈ నిధులతో రోడ్లు, మంచి నీటి సరఫరా, పవర్, ట్రంక్ ఇన్‌ఫ్రా, నీరుకొండ రిజర్వాయర్ వరద నివారణ పనులను చేపట్టాల్సి ఉంటుంది. సంక్రాంతిలోపు రూ.31వేల కోట్ల పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.