News June 4, 2024

ఆ రికార్డును తిరగ రాస్తారా?

image

AP: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నియోజక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి.. టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై (40,930) ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన అత్యధిక మెజార్టీ ఇదే. తర్వాత అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి YCPఅభ్యర్థి ఫల్గుణ.. TDP అభ్యర్థి శ్రావణ్ కుమార్‌పై 31,647 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును ఎవరు తిరగరాస్తారో చూడాలి.

Similar News

News October 9, 2024

‘RC16’లో రామ్ చరణ్ లుక్ ఇదేనా?

image

బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ‘RC16’లో రామ్ చరణ్ నటించనున్న సంగతి తెలిసిందే. క్రీడాప్రధానంగా సాగే ఈ కథలో చెర్రీ ఎలా కనిపిస్తారన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్‌లో ఉంది. ఈరోజు VV వినాయక్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఆయన్ను కలిసి విష్ చేశారు. గడ్డంతో పాటు బాడీ కూడా బిల్డ్ చేసిన లుక్‌లో కనిపిస్తున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’ లుక్‌లో చరణ్ మరో హిట్ కొడతారంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News October 9, 2024

PAK vs ENG.. ఇలాంటి పిచ్‌తో టెస్టు క్రికెట్‌ నాశనం: పీటర్సన్

image

పాకిస్థాన్‌, ఇంగ్లండ్ టెస్టు ఆడుతున్న ముల్తాన్‌లో పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించని విధంగా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌలర్లకు అది శ్మశానం వంటిదంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రెండు రోజుల్లోనైనా ఫలితాన్నివ్వకపోతే ఈ పిచ్ టెస్టు క్రికెట్‌ని నాశనం చేసినట్లేనని మండిపడ్డారు. ఆ పిచ్‌పై వికెట్ తీసేందుకు బౌలర్లు చెమటోడుస్తుండటం గమనార్హం.

News October 9, 2024

గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు: సీఎం రేవంత్

image

TG: తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి నియామకపత్రాలు అందజేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.