News August 23, 2025

ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతారా?

image

AP: విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై క్యాబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులుగా మంత్రులు లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారు. వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

Similar News

News August 23, 2025

నవంబర్‌లో ఇండియాకు లియోనల్ మెస్సీ!

image

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ నవంబర్‌లో ఇండియాకు రానున్నట్లు కేరళ క్రీడాశాఖ మంత్రి వి.అబ్దుహ్మాన్ తెలిపారు. మెస్సీతోపాటు అర్జెంటీనా జట్టు మొత్తం కేరళకు వస్తుందని ఆయన ప్రకటించారు. తిరుప్పూర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగే ఓ ఫ్రెండ్లీ మ్యాచులో అర్జెంటీనా తలపడనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే సమయంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సీ క్రికెట్ కూడా ఆడతారని వార్తలు వస్తున్నాయి.

News August 23, 2025

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు

image

దేశంలోనే అత్యంత ధనిక CMగా చంద్రబాబు నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తెలిపింది. ఆయన ఆస్తులు రూ.931 కోట్లకుపైగా, అప్పులు రూ.10కోట్లు ఉన్నట్లు వెల్లడించింది. రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ CM పెమా ఖండ్ రెండో స్థానంలో, రూ.30 కోట్ల ఆస్తులతో రేవంత్ ఏడో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న CMగా మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలు మాత్రమే.

News August 23, 2025

10,834 ఎకరాల్లో కృష్ణపట్నం కారిడార్

image

AP: చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నిర్మించే కృష్ణపట్నం నోడ్‌ను 10,834 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 3 దశల్లో వివిధ అవసరాలకు వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 44.3% భూమిని పారిశ్రామిక అవసరాలకు, 13.8శాతం భూములను రోడ్ల నిర్మాణానికి, 11.1శాతం భూమిని పచ్చదనం అభివృద్ధికి ఉపయోగించనున్నారు.