News August 27, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మారుతుందా?

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలం నవంబర్‌తో ముగుస్తుంది. ఆ బాధ్యతలు ప్రస్తుత BCCI సెక్రటరీ జై షా చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ తరలింపు గురించి చర్చ మొదలైంది. భారత క్రికెట్ జట్టు ఎలాగూ పాకిస్థాన్‌కు వెళ్లదు. కాబట్టి టోర్నీనే పాక్ నుంచి వేరే దేశానికి మారుస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
Similar News
News November 12, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హోంమంత్రి అనిత సూచించారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని మంత్రి సత్యప్రసాద్ ఫైరయ్యారు. సెంటు పట్టా పేరుతో ₹7,500Cr దోచుకున్నారని ఆరోపించారు.
* శ్రీకాకుళం IIITలో సృజన్(20) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు కారణాలు తెలియరాలేదు.
News November 12, 2025
NIT వరంగల్‌లో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<
News November 12, 2025
పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని

ఢిల్లీ LNJP ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల బృందంతో సమావేశమై మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 12 మంది పౌరులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు.


