News March 20, 2024

ఈ మూడు జట్ల కల నెరవేరేనా?

image

ఐపీఎల్‌లో 16 సీజన్లు గడిచినా మూడు జట్లు మాత్రం ఇప్పటివరకూ టైటిల్ అందుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ మూడు టీమ్‌లు ఫైనల్‌కు వెళ్లినా పరాజయమే పలకరించింది. ఆర్సీబీ పరిస్థితి మరీ విచారకరం. మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినా ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా తమ రాత మార్చుకోవాలని ఈ జట్లు భావిస్తున్నాయి.

Similar News

News October 16, 2025

డిప్లొమా, ఐటీఐ అర్హతతో 186 పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)186 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు NOV 4 వరకు అప్లై చేసుకోవచ్చు.10 పోస్టులకు మాత్రం NOV 5 లాస్ట్ డేట్. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://bel-india.in/

News October 16, 2025

ఆంధ్రా వంటకాలే కాదు.. పెట్టుబడులూ స్పైసీ: లోకేశ్

image

AP: విశాఖతో పాటు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రా వంటకాలు స్పైసీ అంటారు. మా పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయి. కొంతమంది పొరుగువారు ఇప్పటికే ఆ మంట అనుభవిస్తున్నారు’ అని పేర్కొన్నారు. రెండ్రోజుల కిందట విశాఖలో గిగా వాట్ కెపాసిటీతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

News October 16, 2025

మితిమీరిన డైట్ జీవక్రియను దెబ్బతీస్తుంది: వైద్యులు

image

జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. ‘మితిమీరిన ఆహార నియంత్రణ పద్ధతులు మీ శరీరాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. నాణ్యమైన ప్రోటీన్‌ను తగినంతగా ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. వెయిట్స్ ఎత్తడం లేదా రెసిస్టెన్స్ బ్యాండ్‌లతో చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. రోజూ 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం’ అని చెబుతున్నారు.