News August 6, 2024
డీఎస్సీ నియామకాలు ఆలస్యం కానున్నాయా?

TG: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ప్రభావం డీఎస్సీ నియామకాలపై పడే అవకాశం కన్పిస్తోంది. అన్ని రిక్రూట్మెంట్లలోనూ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే సుప్రీం తీర్పునకు ముందే DSC నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు మార్పు సాధ్యం కాదని విద్యాశాఖ చెబుతోంది. స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాయనుంది. కాగా 11,062 పోస్టులకు నిన్నటితో DSC పరీక్షలు ముగిశాయి. 2 రోజుల్లో కీ విడుదల చేస్తారు.
Similar News
News November 3, 2025
వనపర్తి: చేప పిల్లల పంపిణీ వేగవంతం చేయాలి: మంత్రి

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వనపర్తి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పాల్గొన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, నవంబర్ 20లోపు అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
News November 3, 2025
APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: హిందూజా గ్రూప్

AP: రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600MW పెంచేందుకు, రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై MOU పూర్తైంది.
News November 3, 2025
కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.


