News April 3, 2024
ఒడిశాలో ‘ఫ్యామిలీ’, ‘స్టార్’ ఎఫెక్ట్ కాంగ్రెస్కు కలిసొస్తుందా? – 1/2

ఒడిశాలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కుటుంబం, స్టార్లకే ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. డబుగామ్ అసెంబ్లీ సీటు నుంచి మాజీ MLA భుబ్బల్ కుమార్తె లిపికా బరిలో నిలవనున్నారు. ఇక భుజ్బల్ నాబరంగపుర్ నుంచి MPగా పోటీ చేయనున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి భక్త చరణ్ దాస్, ఆయన కుమారుడు సాగర్.. నార్ల, భవానీపట్న అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
<<-se>>#Elections2024<<>>
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.