News April 3, 2024
ఒడిశాలో ‘ఫ్యామిలీ’, ‘స్టార్’ ఎఫెక్ట్ కాంగ్రెస్కు కలిసొస్తుందా? – 2/2
బాలంగిర్ అసెంబ్లీ సీటులో నటుడు మనోజ్ మిశ్రాను బరిలో నిలిపింది. తల్సరాలో భారత్ హాకీ మాజీ కెప్టెన్ ప్రబోధ్ తిర్కేను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక చికిటి అసెంబ్లీ సీటులో అన్నదమ్ములు తలపడనున్నారు. అన్న రవీంద్రనారాయణ్ దయాన్ను కాంగ్రెస్ బరిలో నిలపగా, BJP అతని తమ్ముడు మనోరంజన్కు టికెట్ ఇచ్చింది. ఈ ‘ఫ్యామిలీ’, ‘స్టార్ల’ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News November 8, 2024
నో మోర్ మీడియా ట్రయల్స్: కేరళ హైకోర్టు
విచారణలో ఉన్న కేసుల విషయంలో దర్యాప్తు/న్యాయాధికారి పాత్ర పోషించకుండా మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భావ ప్రకటనా, వాక్ స్వాతంత్య్రం ప్రాథమికాంశాలే అయినా తప్పొప్పులను నిర్ధారించేందుకు అది లైసెన్స్ కాదని వ్యాఖ్యానించింది. మీడియా ట్రయల్స్ వల్ల ప్రజల్లో ముందస్తు అభిప్రాయాలు ఏర్పడే అవకాశముందని, అది న్యాయవ్యవస్థపై అపనమ్మకానికి దారితీస్తుందంది.
News November 8, 2024
అద్వానీకి మోదీ బర్త్ డే విషెస్
బీజేపీ సహా వ్యవస్థాపకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ 97వ పుట్టిన రోజున ప్రధాని మోదీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. కాగా వృద్ధాప్య కారణాలతో అద్వానీ కొన్నేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
News November 8, 2024
పోలీసులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
AP: సోషల్ మీడియాలో పోస్టులు, అరెస్టులపై చర్చించేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.