News August 22, 2025
ఏ క్షణమైనా మాజీ డిప్యూటీ సీఎం అరెస్టు?

AP: మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలోనే నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో తిరుపతి జిల్లా పుత్తూరులోని ఆయన ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పన సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.
Similar News
News August 22, 2025
లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.
News August 22, 2025
కొరత సృష్టించిన వ్యాపారులపై చర్యలు: చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎరువులు, పురుగు మందుల లభ్యత, సరఫరాపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటా వచ్చినా కొరత ఎక్కడ ఉందో గుర్తించాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు.
News August 22, 2025
అందుకే మీకు ప్రతిపక్ష హోదా రాలేదు: ఆనం

AP: హిందూ ధర్మాన్ని విమర్శించడమే వైసీపీ తన పనిగా పెట్టుకుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ‘హిందువులపై రాజకీయ క్రీడ నడపాలనుకోవడం దుర్మార్గం. ఆలయాలు, పాలక మండళ్లు, దేవదాయశాఖపై విషం చిమ్ముతారా? అసత్యాలతో వైసీపీ చేస్తున్న వికృత క్రీడను దేవుడు సైతం క్షమించడు. దేవుళ్లనూ దోచుకున్నందుకే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దేవదాయశాఖలో దాదాపు 500ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాం’ అని తెలిపారు.