News December 17, 2024

గబ్బా టెస్టు డ్రాగా ముగుస్తుందా?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టు చివరి రోజు కూడా వర్షం పడొచ్చని తెలుస్తోంది. రేపు వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్.కామ్ తెలిపింది. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252/9 పరుగులు చేసి ఫాలో ఆన్ తప్పించుకుంది. ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది.

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్: ప్రచార బరిలో బిగ్ బుల్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో CM రేవంత్, గులాబీ బాస్ KCR, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నేతల ప్రచారం వారి పార్టీలకు ప్లస్‌గా మారే అవకాశముంది. అయితే ఇది ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలుపుపై కన్నేయగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS చూస్తోంది. అటు BJP సంచలనం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

News October 22, 2025

వేదవాక్కులే శిరోధార్యాలు

image

వేదం నుంచి జ్ఞానం, సంస్కృతి, జీవితానికి సంబంధించిన మార్గదర్శకాలు, అనేక ఇతర విషయాలు ఉత్పన్నమవుతాయి. వేదం అనేది సంస్కృత మూల పదం ‘విద్’ నుంచి వచ్చింది. వేదం వల్ల ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు లోకమంతా వ్యాపించి సత్ఫలితాలనిస్తాయి. రోగాలు సహా అనేక బాధల నుంచి విముక్తిని ప్రసాదించే శక్తి వేద మంత్రాలకుంది. భగవంతుని ఉచ్వాస నిశ్వాసాలే వేదాలు. అందుకే సకల మానవాళికి వేద వాక్కులు శిరోధార్యాలు.
<<-se>>#VedicVibes<<>>

News October 22, 2025

నేటి నుంచి కార్తీక వైభవం

image

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. * రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.