News April 3, 2024

సిక్కింలో జాతీయ పార్టీలు బోణి కొడతాయా?

image

కాంగ్రెస్, బీజేపీలకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు ఉన్నా ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఉనికిని నిలుపుకునేందుకు శ్రమిస్తున్నాయి. అక్కడి తొలి లోక్‌సభ ఎన్నికల (1977) తర్వాత కాంగ్రెస్ గెలుపు రుచి చూడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఖాతా తెరవలేదు. BJP ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. అధికారం మాట అటుంచితే ఈసారి ఈ పార్టీలు కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తాయా? అనేది చర్చనీయాంశమైంది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News September 15, 2025

రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

image

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.

News September 15, 2025

పాక్‌పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

image

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి హోటల్‌కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్‌డే కావడంతో స్పెషల్ కేక్‌ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.

News September 15, 2025

సీఎం రేవంత్ వద్దకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పంచాయతీ!

image

TG: ప్రైవేట్ కాలేజీల బంద్ పంచాయితీ సీఎం రేవంత్ వద్దకు చేరింది. ఈ విషయమై సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. నిన్నటి సమావేశ సారాంశం, కాలేజీ యాజమాన్యాల డిమాండ్లను మంత్రులు సీఎంకు వివరించారని సమాచారం. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేసే ఆస్కారముందని కాలేజీ యాజమాన్యాలు భావిస్తున్నాయి.