News August 16, 2025

రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

image

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

Similar News

News August 16, 2025

పరిశ్రమలకు ఉచితంగా భూములు: నితీశ్

image

బిహార్‌లో పరిశ్రమలు నెలకొల్పే ప్రైవేటు కంపెనీలకు CM నితీశ్ కుమార్ ప్రత్యేక ఎకనామిక్ ప్యాకేజ్ ప్రకటించారు. ‘క్యాపిటల్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ, రెట్టింపు GST ప్రోత్సాహకాలు, ఏ జిల్లాలోనైనా భూమి ఇస్తాం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు భూమి ఫ్రీగా ఇస్తాం. నెక్ట్స్ 6 నెలల్లో పరిశ్రమలు నెలకొల్పే వారికి ఇవన్నీ వర్తిస్తాయి. బిహార్ యువత భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ట్వీట్ చేశారు.

News August 16, 2025

ఒప్పందం చేసుకోమని జెలెన్‌స్కీకి చెప్తా: ట్రంప్

image

అలాస్కాలో అమెరికా, రష్యా అధ్యక్షుల సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. ‘రష్యాతో ఒప్పందం చేసుకోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సూచిస్తాను. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశమే ఎక్కువుంది. పుతిన్-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నాను. జరిగితే ఆ భేటీలో నేను కూడా ఉండే అవకాశం ఉంది’ అని తెలిపారు. పుతిన్‌తో ఏయే అంశాలపై చర్చించారు అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.

News August 16, 2025

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కన్నుమూత

image

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ బాబ్ సిమ్సన్(89) కన్నుమూశారు. 1957 నుంచి 1978 వరకు 68 టెస్టులు ఆడిన ఆయన 4,869 రన్స్ చేశారు. 71 వికెట్లు పడగొట్టారు. అయితే 1968లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సిమ్సన్ 1977లో 41 ఏళ్ల వయసులో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కానీ మరుసటి ఏడాదే రిటైర్ అయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా కోచ్‌గా మారారు. ఆయన కోచింగ్‌లోనే AUS 1987 WC, యాషెస్ సిరీస్ గెలిచింది.