News June 12, 2024
న్యూయార్క్ స్టేడియం కూల్చివేస్తారా?

భారత్-యూఎస్ఏ మధ్య జరిగే మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు స్టేడియానికి చివరిదిగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ అనంతరం స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు సమాచారం. కాగా టీ20 వరల్డ్ కప్ కోసమే ఈ స్టేడియాన్ని నిర్మించారు. రూ.240 కోట్లతో మూడు నెలల్లోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌లు ఏర్పాటు చేశారు. టోర్నీలో ఈ మైదానంలో అన్ని మ్యాచ్‌లూ లోయెస్ట్ టోటల్‌తోనే ముగిశాయి.
Similar News
News September 15, 2025
స్త్రీ శక్తి పథకంతో మహిళలకు రూ.118 కోట్ల లబ్ధి: మంత్రి

AP: నేటితో స్త్రీ శక్తి పథకం(బస్సుల్లో ఉచిత ప్రయాణం) విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 3.17 కోట్ల ఉచిత టికెట్లతో ప్రయాణించారని పేర్కొన్నారు. సగటున స్త్రీ శక్తి బస్సులు 90% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయన్నారు. మహిళా పురుషుల నిష్పత్తి 63:37గా ఉందని వెల్లడించారు. ఈ పథకంలో మహిళలకు నెల రోజుల్లో రూ.118 కోట్ల ఆర్థిక లబ్ధిని చేకూర్చిందని చెప్పారు.
News September 15, 2025
ఆ పూలు పూజకు పనికిరావు!

పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ‘కింద పడిన, వాసన చూసిన, ఎడమ చేతితో కోసిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేత్తో, ధరించిన వస్త్రాలలో, జిల్లేడు/ఆముదం ఆకులలో తీసుకొచ్చిన పువ్వులను కూడా ఊపయోగించకూడదు’ అని చెబుతున్నారు. పూజలో పువ్వులను సమర్పించేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలు మాత్రమే వాడాలి’ అని అంటున్నారు.
News September 15, 2025
కార్తెలు అంటే ఏంటి?

జ్యోతిషులు ఉపయోగించే నక్షత్రాల ఆధారంగా.. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం రూపొందించుకున్న కాలాన్ని ‘కార్తెలు’ అని అంటారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. అలా మృగశిర కార్తె, చిత్త కార్తె, రోహిణి కార్తె.. వంటివి వస్తాయి. ఈ కార్తెలు సుమారుగా 13-14 రోజులు ఉంటాయి. వీటిని ఉపయోగించి రైతులు వాతావరణ మార్పులను అంచనా వేస్తారు. వ్యవసాయ పనులు చేసుకుంటారు.