News August 11, 2025
జిల్లాలు 32కు పెరగనున్నాయా?

AP: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. 26 జిల్లాలు 32కి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. కృష్ణా(D) నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను NTR(D)లోకి మార్చాలని చూస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి వెళ్లే ఛాన్సుంది. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు రానున్నట్లు సమాచారం.
Similar News
News August 20, 2025
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో మోక్షజ్ఞ ఎంట్రీ: నారా రోహిత్

నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని హీరో నారా రోహిత్ తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు అతడు ఆసక్తిగా ఉన్నాడన్నారు. ‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ కోసం వెతుకుతున్నట్లు మోక్షజ్ఞ చెప్పాడు. అలాంటి కథ ఉంటే ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండొచ్చు. మూవీల కోసమే తన లుక్ మొత్తం మార్చేసుకున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అటు బాలయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని రోహిత్ చెప్పారు.
News August 20, 2025
బిల్లుపై భిన్నాభిప్రాయాలు!

ఏదైనా నేరం కింద పీఎం, సీఎం, మినిస్టర్లు అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైలులో ఉంటే పదవుల నుంచి తొలగించే బిల్లుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చట్టం వల్ల నేరాలు చేయాలనే ఆలోచన రాజకీయ నాయకుల మదిలో నుంచి తొలగిపోతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో చేయని నేరానికి 30 రోజులు జైలులో ఉంచి, పదవిని పోగొట్టే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లుపై మీ కామెంట్?
News August 20, 2025
బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలున్నాయా?

నెల రోజులు జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుందా? అనే ప్రశ్న నెలకొంది. రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లో 2/3 మెజారిటీ ఉండాలి. లోక్‌సభలో 543 సీట్లలో 362 సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా NDA బలం 293. ఇక రాజ్యసభలోని 245 సభ్యుల్లో 164 మంది ఒప్పుకోవాలి. అక్కడ అధికారపక్షానికి ఉన్నది 125. సొంత సంఖ్యా బలం లేక, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లు ఆమోదం ఎలా? అనేది చూడాలి.