News November 23, 2024

ఆ పార్టీలు కలిసిపోతాయా లేక ఉనికే కోల్పోతాయా?

image

మహారాష్ట్రలో పరాభవం శివసేన UBT, NCP SPకి ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో మ్యాజిక్ ఫిగర్‌కు 5-6 సీట్లతో దూరమైన పార్టీలే ప్రాభవం కోల్పోతున్నాయి. ఆర్థిక వనరుల్లేక చతికిలపడుతున్నాయి. అలాంటిది విడిపోయి బలహీనపడిన పై పార్టీలు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రేకు వ్యూహరచన, పార్టీని నడపడంలో అనుభవం లేదు. సీనియర్ శరద్ పవార్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భవితవ్యం బోధపడటం లేదు.

Similar News

News November 10, 2025

CSK నుంచి జడేజా ఔట్?

image

రాజస్థాన్‌తో ట్రేడ్ డీల్‌లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. RR నుంచి సంజూను తీసుకునేందుకు చెన్నై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జడేజా ఇన్‌స్టా అకౌంట్ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ డీల్ తర్వాత ఫ్యాన్స్ వార్‌ను నివారించడానికి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారా? లేక టెక్నికల్ సమస్యనా అనేది తెలియరాలేదు.

News November 10, 2025

ప్రచారం కోసం పిటిషన్లా? కేఏ పాల్‌పై సుప్రీం ఆగ్రహం

image

ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పిల్స్ దాఖలు చేస్తున్నారని మండిపడింది. PPP అంశంపై ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.

News November 10, 2025

6 గంటల్లోనే జీవ వ్యర్థాల నుంచి జీవ ఎరువుల తయారీ

image

జీవవ్యర్థ పదార్థాలను జీవ ఎరువులుగా మార్చే పరిశ్రమ త్వరలో HYDలోని ప్రొ.జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో.. వర్సిటీ ఒప్పందం చేసుకుంది. రూ.5 కోట్లతో ఈ ఎరువుల యూనిట్‌ను 2 నెలల్లోనే ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. జీవవ్యర్థాల నుంచి 6 గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేయవచ్చని ‘బయోవే’ సంస్థ ప్రతినిధులు తెలిపారు.