News December 1, 2024

నేడైనా ప్రాక్టీస్ కొనసాగేనా?

image

ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ఆడాల్సిన 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ కూడా పడలేదు. దీంతో అంపైర్లు తొలి రోజు ఆట రద్దు చేశారు. ఇవాళ టెస్టు ఫార్మాట్‌లో కాకుండా వైట్ బాల్ ఫార్మాట్‌లో 50 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆడతారని సమాచారం.

Similar News

News December 1, 2024

పొద్దున్నే కరివేపాకులు తింటే..

image

పరగడపున కరివేపాకులు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు, వైద్యులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్‌ను తగ్గించగలదు. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లతో జుట్టు రాలడం తగ్గుతుంది. బ్లడ్ షుగర్‌ను నియంత్రించి ఇన్సూలిన్ సెన్సిటివిటీని చక్కదిద్దగలదు. కొవ్వును కరిగించి, మెటాబాలిజాన్ని మెరుగుచేసి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. లివర్, స్కిన్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుంది.

News December 1, 2024

ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి

image

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి వరంగల్‌లోని కాకతీయ వర్సిటీలో లా చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్‌లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు.

News December 1, 2024

FBI డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్

image

భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు. కశ్యప్ అమెరికాలో అవినీతి నిర్మూలనకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన.. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో పని చేశారు.