News April 21, 2025

రేపు ఫలితాలు విడుదల?

image

UPSC సివిల్స్ తుది ఫలితాలు ఇవాళ లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. 1,056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, 2024 జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. దీంతో ఫలితాల విడుదలకు UPSC కసరత్తు చేస్తోంది.

Similar News

News April 21, 2025

రావణుడొచ్చేస్తున్నాడు!

image

రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తోన్న ‘రామాయణ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో నటిస్తోన్న యష్ ఈ వారంలోనే షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారని పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయన ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణ’ చిత్రాన్ని నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు.

News April 21, 2025

BCCI కాంట్రాక్ట్.. శ్రేయస్ సూపర్ కమ్‌బ్యాక్

image

గతేడాది BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌తో తిరిగి రిటైనర్‌షిప్ దక్కించుకున్నారు. CTలో IND తరఫున అత్యధిక రన్స్ చేయడంతో పాటు KKRకు IPL ట్రోఫీ అందించారు. డొమెస్టిక్ క్రికెట్‌లోనూ పరుగుల వరద పారించారు. దీంతో BCCI అతడిని B కేటగిరీలో చేర్చింది. ఇక క్రమశిక్షణ ఉల్లంఘనలతో గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్‌పై BCCI కరుణ చూపింది. అతడిని C కేటగిరీలో చేర్చింది.

News April 21, 2025

IPL.. CSKకు ఇంకా అవకాశం ఉందా?

image

IPLలో మేటి జట్లను చిత్తు చేసిన CSK ఈసారి వరుస పరాజయాలు చవిచూస్తోంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. అయితే ఇప్పటికీ CSK ప్లేఆఫ్స్‌‌కి వెళ్లొచ్చు. ప్రస్తుతం 8 మ్యాచుల్లో 2 నెగ్గి 4 పాయింట్లతో ఉన్న ఆ జట్టు.. మిగతా 6 మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధించాలి. నెట్ రన్‌రేట్ కూడా పెంచుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. మరి CSK ప్లేఆఫ్స్‌కు వెళ్తుందని మీరు భావిస్తున్నారా?

error: Content is protected !!