News March 23, 2024
సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా!

IPLలో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు రెండు టైటిళ్లు గెలిచింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున గిల్ క్రిస్ట్ కెప్టెన్సీలో.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో SRH ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌కు హైదరాబాద్ కెప్టెన్ ఆస్ట్రేలియా ప్లేయరే కావడంతో ఫ్యాన్స్ ఇదే సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కమిన్స్ నాయకత్వంలో టైటిల్ గెలవడం ఖాయమంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Similar News
News March 12, 2026
సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.
News March 12, 2026
మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్

కరోనా కాలంలో మొదలై ఇప్పుడిప్పుడే పూర్తిగా తగ్గుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానం గ్యాస్ కొరతతో మళ్లీ తెరపైకి వస్తోంది. ఇవాళ, రేపు WFH చేయాలని చెన్నై ఆఫీస్ ఎంప్లాయీస్‌కి HCL టెక్ మెయిల్ చేసింది. క్యాంపస్‌లోని కేఫ్‌లో గ్యాస్ కొరతే దీనికి కారణమని పేర్కొంది. చెన్నైతో పాటు HYD, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ సంస్థలనూ గ్యాస్ షార్టేజ్ వేధిస్తోంది. దీంతో WFHలు పెరిగే అవకాశం ఉంది.
News March 12, 2026
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక వార్నింగ్

గత 8 ఏళ్లుగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా అటాక్ చేస్తూ వేధిస్తున్నారని రష్మిక వాపోయారు. 24గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని పేర్కొన్నారు. తన ఫ్యామిలీని కూడా లాగారని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. 24గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ X వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ రద్దు వార్తలపైనే ఆమె ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.


