News October 28, 2024

కొడుకు సినిమాల్లోకి వస్తాడా? సూర్య ఆన్సరిదే

image

కాలేజీ పూర్తవగానే తాను మూడేళ్లు గార్మెంట్ పరిశ్రమలో పనిచేశానని, భవిష్యత్తులోనూ అక్కడే ఉంటాననుకున్నానని హీరో సూర్య చెప్పారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. మీ కొడుకు దేవ్ ఎప్పుడు మూవీల్లోకి వస్తాడన్న ప్రశ్నకు వైజాగ్ ప్రెస్‌మీట్‌లో ఆయన స్పందిస్తూ.. ‘బాబు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్టడీస్‌పాటు ఆటల్లోనూ ముందుంటాడు. భవిష్యత్తులో అతను ఏ రంగాన్ని ఎంచుకున్నా అండగా ఉంటా’ అని పేర్కొన్నారు.

Similar News

News March 19, 2025

ఘోరం.. భర్తను ముక్కలుగా నరికిన భార్య

image

యూపీ మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపింది. లండన్‌‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్.. తన భార్య ముస్కాన్ బర్త్ డే కోసం ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చాడు. ప్రియుడు మోహిత్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్.. సౌరభ్‌ను చంపాలని ప్లాన్ చేసింది. అతడు రాగానే చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటపడ్డాయి. నిందితులు అరెస్ట్ అయ్యారు.

News March 19, 2025

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు

image

*1681- ముంబై ఇండియన్స్
*1649- ఆర్సీబీ
*1513- పంజాబ్ కింగ్స్
*1508- చెన్నై సూపర్ కింగ్స్
*1492- కేకేఆర్
*1348- ఢిల్లీ క్యాపిటల్స్
*1235- రాజస్థాన్
*1038- సన్‌రైజర్స్ హైదరాబాద్ *400- డెక్కన్ ఛార్జర్స్
*332- లక్నో *270- గుజరాత్ టైటాన్స్

News March 19, 2025

ఆ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెంపు

image

AP: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.7వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్‌డీ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.

error: Content is protected !!