News May 7, 2025

కోల్‌‘కథ’ మారేనా? ‘పంజా’బ్ విసిరేనా?

image

వరుస ఓటములతో ఢీలా పడిన KKR ఇవాళ పంజాబ్‌తో తలపడనుంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రా.7.30కు మ్యాచ్ మొదలవనుంది. కోల్‌కతాతో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని PBKS పైచేయి సాధించింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని రహానే సేన, జోరు కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో PBKS 5, KKR 7వ స్థానంలో ఉన్నాయి.

Similar News

News November 19, 2025

ఈ నెల 27న రాహుల్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం

image

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్యా రెడ్డి. ఇక రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.

News November 18, 2025

జైల్లో మొహియుద్దీన్‌పై దాడి!

image

టెర్రర్ మాడ్యూల్‌ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్‌ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్‌లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.

News November 18, 2025

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

image

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎవరి అనుమతితో కూల్చివేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని సీరియస్ అయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.