News May 30, 2024

‘కల్కి’ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా?

image

తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను ఓ లెవెల్‌లో నిర్వహిస్తూ హంగామా చేస్తోంది. ఇదే ఊపులో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అన్నీ కలిసొస్తే జూన్ 7న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News April 8, 2026

BSNL ఫైబర్.. రూ.399తో 50Mbps వేగంతో హైస్పీడ్ డేటా

image

BSNL ఫైబర్ యూజర్లకు అదిరిపోయే న్యూస్. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికోసం BSNL సరికొత్త ‘స్పార్క్’ ఫైబర్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం నెలకు రూ.399 చెల్లిస్తే 50 Mbps వేగంతో 3300GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అలాగే ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ రూ.399 ధర మొదటి 12 నెలలు మాత్రమే వర్తిస్తుందని, 13వ నెల నుంచి రూ.449కి మారుతుందని సంస్థ స్పష్టం చేసింది.

News April 8, 2026

ఇంటర్ రిజల్ట్స్ వార్తలు ఫేక్.. నమ్మొద్దన్న బోర్డు!

image

AP: ఇంటర్ ఫలితాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. ఏప్రిల్ 12న రిజల్ట్స్ విడుదలవుతాయనే వార్తలు పూర్తిగా అబద్ధమని బోర్డు కమిషనర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఫలితాల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విద్యార్థులు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రిజల్ట్స్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తామని చెప్పారు.

News April 8, 2026

వైభవ్‌ను ఇక వెయిట్ చేయించొద్దు: ఇర్ఫాన్

image

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ను ఫోర్లు, సిక్సర్లతో టెన్షన్ పెట్టడం ఈజీ కాదని కొనియాడారు. ‘వైభవ్‌ను ఇక వెయిట్ చేయించకుండా వెంటనే టీమ్ ఇండియాలోకి తీసుకోండి’ అని BCCI సెలక్టర్లను కోరారు. బుమ్రానే ఆలోచనలో పడేసిన ఈ కుర్రాడు మరో 20 ఏళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగలడని, ఇది బౌలర్లకు హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.