News March 31, 2025

ఎల్లుండే లోక్‌సభలోకి వక్ఫ్ సవరణ బిల్లు?

image

వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి ముందే బీజేపీ సీనియర్ నేతలు ఇండీ కూటమి నేతలతో సమావేశమై చర్చించొచ్చని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఆలోపుగా ఉభయ సభలూ ఆమోదిస్తేనే బిల్లు చట్టరూపం దాల్చుతుంది.

Similar News

News November 16, 2025

తూ.గో: మూడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

image

పెరవలి మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల కుమార్తెపై కన్న తండ్రే మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో తల్లికి ఈ విషయం తెలిసింది. ఆమె భర్తను నిలదీయగా వివాదం జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పెనుమంట్రలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును పెరవలి స్టేషన్‌కు బదిలీ చేశారు.

News November 16, 2025

అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

image

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్‌నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

భారీ జీతంతో CSIR-SERCలో ఉద్యోగాలు

image

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (SERC) 30 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://serc.res.in/