News December 5, 2024
ఫిబ్రవరి వరకు ప్రపంచమంతా కల్లోలమేనా?

డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు వెళ్లేంతవరకు ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చితి తప్పదని నిపుణులు అంటున్నారు. వెళ్లిపోయే ఈ 2 నెలల్లో జో బైడెన్, డీప్‌స్టేట్ పరిష్కరించలేని విధంగా ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు. దక్షిణ కొరియాలో ప్రతిష్టంభన, ఫ్రాన్స్‌లో అనిశ్చితి, బంగ్లాలో అల్లర్లు, ఉక్రెయిన్‌కు మిసైళ్ల సరఫరా, వెస్ట్‌ఏషియాలో సీజ్‌ఫైర్ ఉల్లంఘనను ఉదాహరణగా చూపుతున్నారు.
Similar News
News March 15, 2026
ChatGPTని దాటేసిన ఇండియన్ ఆయిల్

దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల డెలివరీ ఆలస్యం అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది ఇండియన్ ఆయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా గూగుల్ ప్లే స్టోర్‌లో ChatGPTని దాటేసి ఇండియన్ ఆయిల్ యాప్ నంబర్-1గా నిలిచింది. ఆ యాప్‌లో ఎల్పీజీ కనెక్షన్స్, సిలిండర్ బుకింగ్, ట్రాకింగ్, డిస్ట్రిబ్యూటర్ మార్పు, మెకానిక్ సర్వీసులు లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.
News March 15, 2026
ఇదే ఊపు కొనసాగుతుంది: రోహిత్ శర్మ

భారత క్రికెట్ గత రెండేళ్లుగా సాధిస్తున్న విజయాలపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో మహిళల జట్టు WC నెగ్గడం, ఇటీవల మెన్స్ T20 WCను కైవసం చేసుకోవడం అద్భుతమని కొనియాడారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటం ఉండదు’ అని ధీమా వ్యక్తం చేశారు. పురుషుల, మహిళల జట్లు రెండూ ప్రస్తుతం ఫుల్ ‘మొమెంటం’లో ఉన్నాయని, ఇదే ఊపు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 15, 2026
బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ రూ.6,500

వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగట్లేదు. NDTV పలు రాష్ట్రాల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ సిలిండర్‌కు ₹6,500, 14KGలు రీఫిల్ చేయడానికి ₹3,500-₹4K వరకు తీసుకుంటున్నారు. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు. ఏజెన్సీలే వీరికి బ్లాక్‌లో గ్యాస్ ఇస్తున్నట్లు తేలింది.


