News May 1, 2024

కోడుమూరులో పసుపు జెండా ఎగిరేనా?

image

కర్నూలు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కోడుమూరు. తొలి నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవానే కొనసాగింది. 1962 నుంచి 13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తొమ్మిది సార్లు, స్వతంత్ర పార్టీ, టీడీపీ ఒక్కసారి నెగ్గాయి. 2014 నుంచి ఈ సీటు వైసీపీ వశమైంది. మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు సతీశ్‌ ఈసారి పోటీలో ఉన్నారు. బొగ్గుల దస్తగిరిని బరిలోకి దింపిన టీడీపీ ఇక్కడ ఎలాగైనా జెండా ఎగరేయాలని తహతహలాడుతోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 22, 2026

విశాఖ: మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.

News March 22, 2026

కొబ్బరి రేట్లు ఢమాల్

image

AP: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. ఈ జాబితాలో కొబ్బరి కూడా చేరింది. నెల వ్యవధిలోనే వెయ్యి కాయల ధర ₹22K నుంచి ₹12K-13Kకు పడిపోయింది. రాష్ట్రంలో 2.7L ఎకరాల్లో కొబ్బరి సాగువుతుంది. ఇతర రాష్ట్రాల కొబ్బరిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధం వల్ల ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోవడంతో ఆ కొబ్బరిని దేశీయంగా వినియోగిస్తున్నారు. దీంతో మన కొబ్బరికి గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

News March 22, 2026

TDR పాలసీలో కీలక మార్పులు

image

TG: భవన నిర్మాణాల్లో ట్రాన్స్‌ఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(TDR) వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 21mకు పైబడిన భవనాలను హై-రైజ్ భవనాలుగా గుర్తించనుంది. 750-2000చ.మీ ప్లాట్లలో 18-21m భవనాలకు TDR తప్పనిసరి చేసింది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్ బ్యాక్ సడలించింది. హై రైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్షేషన్‌కు, 2000 చ.మీ ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించింది.