News January 3, 2025
మళ్లీ లాక్డౌన్ రానుందా?
ఐదేళ్ల తర్వాత కరోనా లాంటి మరో మహమ్మారి చైనాను వణికిస్తోంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన <<15048897>>HMPV<<>> (హ్యూమన్ మెటాన్యుమోవైరస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2019 DEC31న చైనాలో కరోనా తొలి కేసును గుర్తించగా ఊహించని విధంగా 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రభుత్వాలు అలర్ట్ అవ్వాలని, లేకపోతే మళ్లీ లాక్డౌన్ రోజులు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 5, 2025
వందల ఏళ్ల సంప్రదాయం.. ఆదివారం ఆ ఊరిలో మాంసం తినరు
AP: ఆదివారం వచ్చిందంటే చాలా ఇళ్లలో మాంసాహారం తప్పనిసరి. కానీ నంద్యాల(D) ఎస్.కొత్తూరులో మాత్రం వందల ఏళ్లుగా సండే ఎవరూ మాంసం తినరు. మద్యం తాగరు. గ్రామంలో ఎవరైనా ఆదివారం మరణించినా అంత్యక్రియలు మరుసటి రోజు నిర్వహిస్తారు. 400 ఏళ్ల కిందట ఓ పొలంలో దొరికిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహంతో ఆలయం నిర్మించారని, ఆ స్వామికి ఆదివారం ప్రీతికరమైన రోజని గ్రామస్థుల భావన. అందుకే భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.
News January 5, 2025
BGT2024-25: టాప్-10 ఆటగాళ్లు వీరే
BGTలో బ్యాటింగ్‌లో హెడ్(448 రన్స్), బౌలింగ్‌లో బుమ్రా(32 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచారు. హెడ్ తర్వాత జైస్వాల్(391), స్మిత్(314), నితీశ్(298), రాహుల్(276), పంత్(255), లబుషేన్(232), క్యారీ(216), కోహ్లీ(190), ఖవాజా(184) ఉన్నారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా తర్వాత వరుసగా కమిన్స్(25), బోలాండ్(21), సిరాజ్(20), స్టార్క్(18), లయన్(9), హేజిల్‌వుడ్(6), ప్రసిద్ధ్(6), నితీశ్(5), ఆకాశ్ దీప్(5) ఉన్నారు.
News January 5, 2025
సంక్రాంతికి ఊరెళ్లేవారికి శుభవార్త
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి SCR ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. చర్లపల్లి-తిరుపతి, వికారాబాద్-కాకినాడ, కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-శ్రీకాకుళం, చర్లపల్లి-శ్రీకాకుళం, – నాందేడ్-కాకినాడ, చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్ ప్రాంతాలకు 52 ప్రత్యేక రైళ్లను ఈ నెల 6వ తేదీ నుంచి 18 వరకు వివిధ తేదీల్లో నడపనుంది. రేపు లేదా ఎల్లుండి ఈ రైళ్ల బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.