News October 17, 2024
లాకర్లోని వస్తువులు పోతే పరిహారం వస్తుందా?

బ్యాంకులను బట్టి పరిహారం వేరుగా ఉంటుంది. దొంగతనం, తడిచి పాడవడం, షాట్ సర్క్యూట్ వంటి కారణాలతో లాకర్లోనివి దెబ్బతిన్నా, పోయినా పూర్తి నష్టం భర్తీ కాదు. కొన్ని బ్యాంకులు అద్దెకు 100 రెట్ల వరకు క్లెయిమ్ ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు లాకర్లలో కస్టమర్లు ఏం ఉంచుతారో చూడము కాబట్టి ఏ పరిహారం ఇవ్వమంటున్నాయి. అందుకే లాకర్ తీసుకునే ముందే ఈ రూల్స్ తెలుసుకోవాలి. లాకర్లో డబ్బు ఉంచరాదు కాబట్టి నోట్లు పోతే ఇక అంతే.
Similar News
News November 25, 2025
వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లు: పార్థసారథి

AP: ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు కట్టివ్వాలన్న లక్ష్యంలో ఇప్పటికే 3 లక్షలు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘ఇళ్లులేని నిరుపేదలకు 2029కల్లా శాశ్వత గృహ వసతి కల్పిస్తాం. వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లను పూర్తి చేస్తాం. ఉగాదికి 5 లక్షలు, జూన్‌కి మరో 87వేల గృహాలను పూర్తి చేయాలని పని చేస్తున్నాం. CM ఆదేశాల మేరకు 3 నెలలకోసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’ అని తెలిపారు.
News November 25, 2025
ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
అరుణాచల్ మా భూభాగం: చైనా

షాంఘై ఎయిర్‌పోర్టులో భారత మహిళను <<18373970>>వేధించారన్న<<>> ఆరోపణలను చైనా ఖండించింది. ‘ఎలాంటి నిర్బంధం, వేధింపులకు ఆమె గురి కాలేదు. చట్టాలు, రూల్స్‌కు అనుగుణంగానే అధికారులు వ్యవహరించారు. రెస్ట్ తీసుకునేందుకు చోటిచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. జాంగ్నాన్(అరుణాచల్) చైనా భూభాగం. ఇండియా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను మేం ఎప్పుడూ గుర్తించలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.


