News February 4, 2025
హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా?: MLA పాయల్ శంకర్

TG: బీసీల్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలు లేని సీట్లను బీసీలకు కేటాయిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News October 22, 2025
‘పేరు వల్లే’ సర్ఫరాజ్ సెలక్ట్ కాలేదా: షమా

సౌతాఫ్రికా-Aతో పంత్ సారథ్యంలో ఆడనున్న టీమ్ ఇండియా-A జట్టులో సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఖాన్ అనే ఇంటిపేరు వల్లే సర్ఫరాజ్ను ఎంపిక చేయలేదా? జస్ట్ ఆస్కింగ్. ఇలాంటి విషయంలో గంభీర్ ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు’ అని AICC అధికార ప్రతినిధి షమా మహ్మద్ ట్వీట్ చేశారు. టీమ్ ఇండియాని కాంగ్రెస్ మతం పేరుతో వేరు చేయాలని చూస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
News October 22, 2025
AP న్యూస్ రౌండప్

*పాయకరావుపేట నియోజకవర్గంలోనే లక్ష ఉద్యోగాలిస్తాం: హోంమంత్రి అనిత
*కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
*కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరాబానును కస్టడీకి తీసుకుని VJA తరలించిన NIA అధికారులు
*గుంటూరు(D) ఇటికంపాడు రోడ్డు శివారులో పిడుగుపాటుకు మరియమ్మ(45), షేక్ ముజాహిద(45) అక్కడికక్కడే మృతి
News October 22, 2025
NMLలో 21 పోస్టులు

NTPC మైనింగ్ లిమిటెడ్(NML) 21పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్మెంట్), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nml.co.in