News December 11, 2024
మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?: కేటీఆర్

TG: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని CMను తెలంగాణ నెత్తిపై రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి KTR లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు, విగ్రహాలు మార్చలేదన్నారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నీచ సంస్కృతికి ముగింపు పలకకపోతే జరగబోయేది అదేనని హెచ్చరించారు.
Similar News
News December 8, 2025
శబరిమల: 18 మెట్లు దేనిని సూచిస్తాయంటే?

పదునెట్టాంబడిలో మొదటి 5 మెట్లు మనిషిలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుని మందుకు సాగాలనే సారాంశాన్ని అందిస్తాయి. తర్వాత వచ్చే 8 మెట్లు కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం అనే 8 రాగద్వేషాలను సూచిస్తాయి. వాటిని వదిలి మంచి మార్గంలో నడవాలని చెబుతాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలకు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీక. <<-se>>#AyyappaMala<<>>
News December 8, 2025
షూటింగ్ ప్రపంచకప్లో స్వర్ణం సాధించిన సురుచి

ఖతార్లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్లో భారత షూటర్ సురుచీ సింగ్ స్వర్ణం సాధించారు. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 245.1 పాయింట్లతో పోడియం ఫినిష్ చేసి జూనియర్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. హర్యానాకు చెందిన సురుచి ఈ ఏడాది బ్యూనస్ ఐరీస్, లిమా వేదికలపై కూడా వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచారు.
News December 8, 2025
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.


