News March 31, 2025
అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్ ఫైర్

AP: శ్రీసత్యసాయి(D) రాప్తాడులో YCP కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను మాజీ సీఎం జగన్ ఖండించారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు BC కార్యకర్తను TDP నేతలు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.
Similar News
News April 2, 2025
శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం

AP: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.
News April 2, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్

భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రమే ఆడతానని తెలిపారు. మొత్తం 320 మ్యాచులు ఆడిన వందన 158 గోల్స్ చేశారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్ చేసిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. క్రీడా సేవలకు గుర్తుగా ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డులు వరించాయి.
News April 2, 2025
చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు?

చలాన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక చలాన్‌ను 3 నెలలలోపు చెల్లించకపోతే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు చలాన్లు పడినవారి లైసెన్స్‌ను కనీసం 3 నెలలపాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని సమాచారం.