News March 11, 2025

2027 WCలో ఆడతారా? రోహిత్ శర్మ సమాధానమిదే

image

తాను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం జట్టులో కొనసాగాలనుకుంటున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ‘2027 వన్డే వరల్డ్ కప్‌కి ఇంకా చాలా సమయం ఉంది. ఆ టోర్నీలో ఆడతానో లేదో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం నేను బాగా ఆడుతున్నా. టీమ్ కూడా నాతో ఆడటాన్ని ఇష్టపడుతోంది. ప్రస్తుతం జట్టు ఆడుతున్న తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని అనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 4, 2026

బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.

News April 4, 2026

‘పంచభక్ష్య పరమాన్నాలు’ అంటే తెలుసా?

image

మంచి భోజనాన్ని మన పెద్దలు ‘పంచభక్ష్య పరమాన్నాలు’ అని పిలుస్తుంటారు. దీని అర్థం మనం తినే పదార్థాలు ఐదు రకాలుగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
భక్ష్యం: గారెలు, బూరెలు వంటి కొరికి తినే పదార్థాలు.
భోజ్యం: పులిహోర, దద్దోజనం వంటి నమిలి తినేవి.
చోష్యం: పాయసం, చారు వంటి జుర్రుకునేవి.
లేహ్యం: తేనె, చలివిడి వంటి నాకబడేవి.
పానీయం: నీళ్లు, పండ్ల రసం వంటి తాగే పదార్థాలు.

News April 4, 2026

పాయింట్ల టేబుల్లో పంజాబ్ ‘కింగ్’

image

IPL-2026లో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా PBKS నిలిచింది. దీంతో ఆ టీమ్ 4 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. అదే సమయంలో CSK ఆడిన 2 మ్యాచుల్లో ఓడి పాయింట్ల ఖాతా తెరవలేదు. -2.562 నెట్‌ రన్‌‌రేట్‌తో అట్టడుగు స్థానంలో నిలిచింది. SRH 2 ఆడి ఒకదాంట్లో గెలవగా, KKR 2 మ్యాచుల్లోనూ ఓడి పాయింట్లు సాధించలేదు. RR, RCB, DC, MI ఒక్కో మ్యాచ్ ఆడి గెలవగా(2 పాయింట్లు), GT, LSG ఓడిపోయాయి.