News July 5, 2024
కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది వీరేనా?

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
Similar News
News December 18, 2025
పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

AP: రాష్ట్రంలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర-2 పథకంలో భాగంగా రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.
News December 18, 2025
రేషన్ కార్డుదారులకు అలర్ట్

TG: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
News December 18, 2025
హిల్ట్ పాలసీలో సవరణలకు ప్రభుత్వ యోచన

TG: HILT పాలసీలో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 22 పారిశ్రామిక పార్కులలోని కంపెనీల యాజమాన్యాలు భూములను నివాస ప్లాట్లుగా మార్చడానికి దరఖాస్తు చేసుకోకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. త్వరలో వాటితో సమావేశం ఏర్పాటు చేసి పాలసీలో ప్రస్తుతం సవాలుగా ఉన్న సమస్యలపై చర్చిస్తామని ఉన్నతాధికారి ఒకరు ‘వే2న్యూస్’కు తెలిపారు. అవసరమైతే వారి అవసరాలకు అనుగుణంగా పాలసీలో మార్పులు చేస్తామని చెప్పారు.


