News August 22, 2025

టిక్‌టాక్ రీఎంట్రీ ఇవ్వనుందా?

image

భారత్‌లో టిక్‌టాక్ రీఎంట్రీపై SMలో చర్చ జోరందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సానుకూల సంకేతాలున్నట్లు తెలుస్తోంది. భారత్-చైనా సంబంధాలు బలపడటం దీనికి బలం చేకూరుస్తోంది. ఇటీవల కొందరికి టిక్‌‌టాక్ సైట్ ఓపెన్ కాగా మరికొందరికి ఓపెన్ కాలేదట. దీన్నిబట్టి సైట్ టెస్టింగ్ దశలో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత డేటా చోరీకి గురవుతోందంటూ టిక్‌టాక్‌ను 2020లో కేంద్రం నిషేధించింది.

Similar News

News March 4, 2026

ఖమేనీ రెండో కొడుకు ఆస్తి ఎంతో తెలుసా?

image

ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. ఆయనకు బ్రిటన్‌లో 100 మిలియన్ పౌండ్ల విలువైన 11 ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా భారీగా ఆస్తులు, గోల్డ్ కూడబెట్టినట్లు నిపుణుల అంచనా. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో బ్యాంకులు, స్విస్ బ్యాంకులో ఖాతాలు, ప్రైవేట్ జెట్ ఉన్నాయని తెలుస్తోంది. <<19292894>>IRGC<<>>కి నిధులు సమకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

News March 4, 2026

టమాటా రేట్ల పతనం.. ప్రభుత్వాలు ఇలా చేస్తే?

image

AP, TGలో టమాటా ధరలు కుప్పకూలిపోయాయి. కిలో ₹2-5కు కొనేందుకూ <<19258574>>వ్యాపారులు<<>> ముందుకు రావట్లేదు. దీంతో రైతులు వృథాగా పంటను పడేస్తున్నారు. ఇలా రేట్లు పడిపోయినప్పుడు టమాటాలతో పచ్చళ్లు, కెచప్/ప్యూరీ, టమాటా పొడి చేసుకునేలా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. టమాటా విస్తీర్ణం అధికంగా ఉండేచోట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఏర్పాటు చేయాలి. ఇతర పంటలకూ ఇలాగే ప్రత్యామ్నాయాలను చూపితే రైతులకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. ఏమంటారు?

News March 4, 2026

జాన్సెన్ దూకుడు.. SA స్కోర్ ఎంతంటే?

image

T20WC: NZతో జరుగుతున్న సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేశారు. మార్క్రమ్ 18, డికాక్ 10, బ్రెవిస్ 34, మిల్లర్ 6, స్టబ్స్ 29 రన్స్ చేశారు. రచిన్ రవీంద్ర, మెక్‌కొంచి, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ 30 బంతుల్లోనే 55* రన్స్ చేశారు. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డారు.