News January 22, 2025
తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తాడా?

టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20లో సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20ల్లో శతకాలు బాదారు. సూపర్ ఫామ్, మూడో స్థానంలో బరిలోకి దిగడం, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కావడంతో ఆయన ఈ రికార్డును చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
Similar News
News November 26, 2025
ఏపీ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు అప్లై చేశారా?

ఏపీ గ్రామీణ బ్యాంకులో 7 ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. వయసు 35 నుంచి 63ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.23,500, సీనియర్ ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్కు రూ.30వేల చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://apgb.bank.in/
News November 26, 2025
‘ఉద్యాన రైతుల ఆదాయం పెరగాలి.. కార్యాచరణ రూపొందించండి’

AP: రాయలసీమలోని 5.98 లక్షల మంది ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ఈ కార్యాచరణ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పూర్వోదయ కింద రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు.
News November 26, 2025
రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ స్పందిస్తారా?: కేటీఆర్

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల <<18387531>>తగ్గింపు<<>>, డబ్బు దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని రాహుల్ గొప్పగా చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రూ.160 కోట్లు ఖర్చు చేశారు. తీరా చూస్తే 24 నుంచి 17 శాతానికి తగ్గించారు. దీనిపై రాహుల్ స్పందించే అవకాశం ఉందా?’ అని ట్వీట్ చేశారు.


