News December 5, 2024
సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: జగన్

AP: జనవరి మూడో వారం నుంచి తాను జిల్లాల్లో పర్యటిస్తానని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు (బుధ, గురువారం) పర్యటించి అక్కడే బస చేస్తానని చెప్పారు. కార్యకర్తలతో మమేకం అవుతానన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా పనిచేయాలని నేతలకు సూచించారు.
Similar News
News January 15, 2026
నేటి నుంచి అందుబాటులోకి వెస్ట్ బైపాస్

AP: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా-చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్గేట్ జంక్షన్ వరకు ఒకవైపు రహదారిపై అన్ని రకాల వాహనాలకు అనుమతిస్తున్నట్లు NHAI తెలిపింది. గుంటూరు, అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వాహనాలకు ఇది కీలక మార్గంగా మారనుంది.
News January 15, 2026
సంక్రాంతి: ఈ వస్తువులు కొంటే శ్రేయస్సు

సంక్రాంతి వేళ ఇంటికి శ్రేయస్సు తెచ్చే వస్తువులు కొనడం ఎంతో శుభప్రదమంటున్నారు వాస్తు నిపుణులు. ‘ఇంటి ప్రతికూల శక్తిని తొలగించడానికి విండ్ చైమ్స్, ఆర్థిక స్థిరత్వం కోసం ఉత్తర దిశలో లోహపు తాబేలు, అదృష్టం కోసం క్రిస్టల్ వస్తువులు ఉంచాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రధాన ద్వారానికి లక్కీ నాణేలు, దాంపత్య బంధం బలపడటానికి నైరుతి దిశలో మాండరిన్ బాతుల జంటను ఏర్పాటు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News January 15, 2026
ఎయిర్‌స్పేస్ మూసేసిన ఇరాన్

ఇరాన్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది. ముందస్తు అనుమతి లేకుండా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ఏ విమానాన్ని అనుమతించబోమని ఆ దేశ రక్షణ శాఖ NOTAM జారీ చేసింది. దేశంలో అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా యూరప్, ఆసియా దేశాల మధ్య విమాన సర్వీసుల్లో కొన్నింటిని దారి మళ్లిస్తుండగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.


