News April 11, 2025
2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం: మోదీ

2036 ఒలింపిక్స్ భారత్‌లో జరిగేలా ప్రయత్నం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో విశ్వక్రీడలు నిర్వహిస్తే భారత్ ఖ్యాతి పెరుగుతుందని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా వారణాసి యువత నేటి నుంచే శిక్షణ ప్రారంభించాలని కోరారు. గతంతో పోల్చితే కాశీ చాలా అభివృద్ధి చెందిందని, హెల్త్ క్యాపిటల్‌గా మారిందన్నారు. వారణాసిలో పలు అభివృద్ధి పనులకు నేడు మోదీ శంకుస్థాపన చేశారు.
Similar News
News September 15, 2025
మరో ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మిగతా ఇద్దరు చంచల్, జహల్‌పై తలో రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,42,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 15, 2025
పలు కాలేజీలు బంద్.. ఎగ్జామ్స్‌కు మినహాయింపు!

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే పరీక్షలకు ఈ బంద్ మినహాయింపు ఉంటుందని తెలిపాయి. అయితే మరికొన్ని కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వంతో చర్చల తర్వాత బంద్‌పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.