News February 24, 2025
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో ఊర్వశీ రౌతేలా?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు టాక్. నెక్స్ట్ షెడ్యూల్లో ఆమె షూటింగ్లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ మూవీలో టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.
Similar News
News October 27, 2025
భారీ వానలు.. మినుమును ఇలా రక్షించుకోండి

నంద్యాల, బాపట్ల, YSR, NTR, తూ.గో, కృష్ణా జిల్లాల్లో మినుము పంట విత్తు నుంచి కోత దశలో ఉంది. భారీ వర్షాలకు నీరు నిలిచి పంట కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారణకు ముందుగా పొలంలోని నీటిని తొలగించాలి. ఇనుముధాతు లోప సవరణకు ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా. సిట్రిక్ యాసిడ్ 0.5గ్రా. 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం తర్వాత 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పైరుపై పిచికారీ చేయాలి.
News October 27, 2025
భారీ వానలు.. మినుములో తెగుళ్ల నివారణ

భారీ వర్షాలకు మినుము పంటకు పలు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వేరుకుళ్లు, కోరినోస్పోరా ఆకు మచ్చ తెగులు నివారణకు హెక్సాకొనజోల్ 5SC 2 మి.లీ లేదా ప్రొపికొనజోల్ 25EC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో మారుకా కాయ తొలుచు పురుగు నివారణకు వర్షాలు తగ్గిన వారం రోజులకు క్లోరిఫైరిఫాస్ 25EC 2.5 మి.లీ లేదా నోవాల్యూరాన్ 45 SC 1మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News October 27, 2025
మహిళా క్రికెటర్లపై దాడి.. మంత్రి వ్యాఖ్యలతో దుమారం

AUS మహిళా క్రికెటర్లను ఓ వ్యక్తి <<18103257>>అసభ్యంగా<<>> తాకిన ఘటనపై MPకి చెందిన మంత్రి విజయ్వర్గీయా కామెంట్స్ దుమారం రేపాయి. ‘ఈ ఘటన ప్లేయర్లకు గుణపాఠం లాంటిది. ENGలో ఓ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్కు అమ్మాయి కిస్ ఇవ్వడం, అతడి దుస్తులు చింపేయడం వంటివి చూశాను. ప్లేయర్లు తమ పాపులారిటీని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఆయనపై విపక్షాలు, ఉమెన్ రైట్స్ గ్రూప్స్ భగ్గుమన్నాయి.


