News August 6, 2024
నీరజ్ కంటే ముందే వినేశ్ గోల్డ్ కొట్టేనా?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 3 బ్రాంజ్ మెడల్స్ మాత్రమే గెలిచింది. మన అథ్లెట్లు వరుసగా నిరాశపరుస్తుండటంతో అందరి ఆశలు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే పెట్టుకున్నారు. నమ్మకాన్ని నిలబెడుతూ నీరజ్ ఫెనల్స్ చేరారు. ఆగస్టు 8న ఫైనల్‌లో గోల్డ్ కోసం బరిలో నిలిచారు. కాగా ఔటాఫ్ సెలబస్ నుంచి వచ్చినట్లుగా భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ మూడు మ్యాచులు గెలిచి ఫైనల్ చేరారు. రేపే ఆమె ఫైనల్ మ్యాచ్.
Similar News
News November 20, 2025
WNP: గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లుపూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ గిరిధర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసీసీ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎంసీసీ ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలన్నారు.
News November 20, 2025
బండి సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.
News November 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 72 సమాధానాలు

నేటి ప్రశ్న: కురుక్షేత్రంలో కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకు పోవడానికి, అది బయటకు రాకపోవడానికి కారణం ఏంటి?
జవాబు: ఓసారి కర్ణుడు భూమిపై పడిన నెయ్యిని తీస్తూ నెయ్యి తడిసిన మట్టిని చేతులతో బలంగా పిండాడు. ఈ చర్యతో బాధపడిన భూమాత ఆగ్రహించింది. ‘నువ్వు నాకు ఈ బాధకు కలిగించినందుకు ప్రతిచర్యగా నీ జీవితంలో అతి కీలకమైన యుద్ధ సమయంలో నీ రథ చక్రాన్ని నేలలో బలంగా పట్టుకుంటాను’ అని శపించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


