News August 14, 2025

‘వార్ 2’ వచ్చేది ఈ OTTలోకేనా?

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ మూవీ ఇవాళ విడుదలైంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తుందని సమాచారం. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తుందని టాక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు.

Similar News

News August 14, 2025

ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్

image

AP: నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న ఉ.10గంటలకు విడుదల చేయనున్నట్లు TTD తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఈ నెల 21న ఉ.10గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 23న ఉ.10గంటలకు అంగప్రదక్షిణ, 11గంటలకు శ్రీవాణి ట్రస్టు టోకెన్ల కోటా, 25న ఉ.10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

News August 14, 2025

DSC స్పోర్ట్స్ కోటా పోస్టుల పేరుతో మోసం.. జాగ్రత్త!

image

AP: స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 5,326 అప్లికేషన్స్ రాగా, 1200 మంది 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ క్రమంలో శాప్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటూ అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నారని జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. శాప్ నుంచి అలా ఎవరూ కాల్ చేసి డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. ఆశపడి డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు.

News August 14, 2025

J&Kలో విషాదం.. కల్చరల్, ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు రద్దు

image

జమ్మూ కశ్మీర్‌లో <<17404381>>క్లౌడ్ బరస్ట్<<>> వల్ల ఇప్పటివరకు 30కి పైగా మరణాలు సంభవించాయి. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ విషాదం కారణంగా రేపు సాయంత్రం జరగాల్సిన ‘ఎట్ హోమ్’ టీ పార్టీని రద్దు చేసినట్లు CM ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రేపు జరగాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్‌లనూ నిలిపివేయనున్నట్లు తెలిపారు. స్పీచ్, మార్చ్ ఫాస్ట్ వంటి అధికారిక కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.